telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియా కరోనా అప్డేట్…

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,20,529 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,86,94,879 కి చేరింది. ఇందులో 2,67,95,549 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,55,248 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 3,380 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,44,082 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,97,894 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 22,78,60,317 మందికి వ్యాక్సిన్ అందించారు.

Related posts