telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ గురించి భారత బ్యాటింగ్‌ కోచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాట్స్‌మెన్‌‌లో ఒక్కోక్కరు ఒక్కదాంట్లో స్పెషలిస్ట్ అయితే.. విరాట్ దగ్గర అన్ని ఉంటాయని చెప్పాడు భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ‘జట్టులో చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయి. అవే జట్టు దృక్పథాన్ని మెరుగుపరుస్తాయి. అందుకు భిన్నంగా నేను ఒక్కొక్కరితోనూ ప్రత్యేకంగా మాట్లాడతాను. ఉదాహరణకు పుజారా, పంత్‌ భిన్నమైన మనస్తత్వాలు, పని విలువలు కలిగిన వారు. వారు చెప్పేది జాగ్రత్తగా వింటేనే వారి గురించి బాగా అర్థమవుతుంది. వారు ఎలాంటి పరిష్కారాలు కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఎక్కువ ప్రతిభ, వైవిధ్యం గలవారితో విడివిడిగా మాట్లాడటం అవసరం. పుజారాకు అంకితభావం ఎక్కువ. పట్టుదలగా, క్రమశిక్షణతో ఉంటాడు. క్రికెట్లోనే కాదు అతడి జీవనశైలీ ఇలాగే ఉంటుంది. ఒకే తరహా పద్ధతులు ఉంటాయి. ఇక పంత్‌ నిర్భయంగా చాలా సరదాగా ఉంటాడు. తన శైలిలో ఆడేందుకు ఇష్టపడతాడు. మరి ఏ జట్టులోనూ 11 మంది పుజారాలు, 11 మంది పంత్‌లు ఉండరు కదా.? పంత్‌, పుజారా గెలుపు కూర్పులో ఉండాల్సిందే. అందుకే వారిని వారి శైలిలోనే ఉండనివ్వడం ముఖ్యం. నా వరకు పుజారా అదనంగా తన అమ్ముల పొదిలో కొత్త షాట్లు సంపాదించుకోవడం, పంత్‌ అవసరమైతే ఎక్కువ బంతులు డిఫెండ్‌ చేయగలిగేలా చేయడమే ముఖ్యం’ అని రాథోడ్‌ తెలిపాడు. కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడని బ్యాటింగ్ కోచ్ ప్రశంసించాడు.

Related posts