telugu navyamedia
రాజకీయ

ఎర్ర‌కోట‌పై తివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన మోదీ..

*ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మోదీ
*భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది
*75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయి
*దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్‌
*రాజ్‌ ఘాట్‌ దగ్గర నివాళులు అర్పించిన మోదీ..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబయ్యింది. భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.

అంతకు ముందు ప్రధాని మోదీ.. రాజ్‌ఘాట్‌లోమహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అక్కడ మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం అలపించారు. భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.

MODI FLAG HOISTING

అనంతరం చారిత్రక ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ మాట్లాడుతూ..దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ నులుమూల‌ల‌ భారత స్వాతంత్య్ర దినోత్సవం సంబరాలు జరుగుతున్నాయని.. అమృత మహోత్సవ వేళ భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించేవారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు.

Independence Day 2022 pm modi hoisting national flag on red fort

అమృత మహోత్సవాల వేళ కొత్త దశ, దిశ ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్యాగధనుల పోరాట ఫలితమే మన స్వాతంత్య్రం అని గుర్తుచేశారు. ఎందరో మహనీయులు పోరాడి మనకు స్వాతంత్య్రం అందించారని చెప్పారు.

కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్‌.

Related posts