telugu navyamedia
సినిమా వార్తలు

టీనేజ్ లోకి అడుగుపెట్టిన జూనియర్ సూపర్ స్టార్… శుభాకాంక్షల వెల్లువ

Gautham

సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్రల కుమారుడు గౌతమ్ క‌ృష్ణ జన్మదినోత్సవం నేడు. నేటితో గౌతమ్ 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. మ‌హేష్ అభిమానులు గౌత‌మ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్య‌క్రమాలు చేప‌డుతున్నారు. జూనియర్ సూప‌ర్ స్టార్ అంటూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. గౌతమ్ 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం చ‌దువుపైనే పూర్తి దృష్టి పెట్టిన గౌత‌మ్ రానున్న రోజుల‌లో హీరోగా ప‌ల‌క‌రించిన ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. లుక్‌లోనే కాదు వ్య‌క్తిత్వం, గుణ‌గ‌ణాల‌లోను గౌత‌మ్‌, మ‌హేష్‌లు ఇద్ద‌రు ఒకటే. ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా గౌతమ్‌కు బర్త్‌డే విషెస్ అందజేశారు. “గడియారం ముల్లు 12కు చేరగానే నా కొడుకు 13లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు గౌతమ్ టీనేజర్. మహేష్.. గౌతమ్‌కు ఎంతో ఇష్టమైన చాక్లెట్ తినిపించి, ముద్దు పెట్టుకున్నారు. నా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. లవ్యూ మిస్టర్ గౌతమ్ ఘట్టమనేని” అని నమత్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Related posts