telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య-బోయపాటి మూవీకి ఈ టైటిల్ ఫిక్స్ ?

BB3

బాలయ్య-బోయపాటి అప్ కమింగ్ మూవీ బీబీ3కి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల బాలయ్య 60వ బర్త్ డే సందర్భంగా విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య నుంచి వారి అభిమానులు ఏదైతో కోరుకుంటారో.. బోయపాటి తొలి టీజర్‌తోనే అందించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ తొలి నుంచి ప్రచారంలో ఉండగా.. అదే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండగా.. నందమూరి ఫ్యాన్స్ ఇప్పటికే ‘మోనార్క్’ టైటిల్‌ను వైరల్ చేస్తున్నారు. సింహ, లెజెండ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలయ్య-బోయపాటి ‘మోనార్క్’తో హ్యాట్రిక్‌పై కన్నేశారు.

Related posts