telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో హెచ్1బీ వీసాదారులకు ఊరట!

Hib visa us

కరోనా ఎఫెక్ట్ తో ఇమ్మిగ్రేషన్ ను ఆర్నెల్ల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్1బీ వీసాదారుల చట్టబద్ధత జూన్ చివరి వారానికల్లా ముగుస్తుందని అక్కడి అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నిర్ణయంతో రెండు లక్షల మంది హెచ్1బీ వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న రెండున్నర లక్షల మందికి కూడా ఈ నిర్ణయం నిరాశ కలిగించింది. ఈ నేపథ్యంలో, హెచ్1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ఊరట కలిగించేలా అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హెచ్1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్టు ప్రకటించింది.అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) దీనిపై స్పష్టతనిస్తూ, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాల్సిందిగా తాము ఇప్పటికే జారీ చేసిన నోటీసులు అందుకున్నవారికి ఈ వెసులుబాటు వర్తిస్తుందని వెల్లడించింది. తమ నోటీసులపై స్పందించడానికి, తాము కోరిన పత్రాలు సమర్పించడానికి మరో 60 రోజుల సమయం ఇస్తున్నామని స్పష్టం చేసింది.

Related posts