telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ద‌మ్ముంటే గుడివాడ‌లో చంద్ర‌బాబు పోటీ చేయాలి -చంద్ర‌బాబుకు కొడాలి నాని స‌వాల్

*వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలోచంద్ర‌బాబు గెలిపించి చూపించాలి..చంద్ర‌బాబుకు కొడాలి నాని స‌వాల్
*ద‌మ్ముంటే గుడివాడ‌లో చంద్ర‌బాబు పోటీ చేయాలి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ‌లో తనపై పోటీ చేసి గెలవాలని చాలెంజ్ చేశారు. కొడాలి నాని ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ… ఎన్టీఆర్ ప్ర‌జానాయ‌కుడు అని..ఆయ‌న ఏ పార్టీకి చెందిన‌వారు కాద‌ని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు టీడీపీ కి సంబంధం లేద‌ని ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు లేఖ రాసిన విష‌యం వాస్త‌వం కాదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నన్ను ఓడించడం కాదు.. 2024లో కుప్పంలో గెలిచిచూపించాల‌ని నాని స‌వాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, అతన్ని నమ్ముకున్న దత్తపుత్రుడిని తుక్కుతుక్కు కింద ఓడిస్తామ‌ని అన్నారు.

2009,2014 ఎన్నికల్లో గెలిచా 2024లో కూడా నేనే గెలుస్తా, గుడివాడలోనే చస్తాను అని అన్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ ని, గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన‌వ్య‌క్తి చంద్ర‌బాబు అని అన్నారు.

ఎన్టీఆర్‌ను చంపిన చంద్రబాబు నిమ్మకూరులో బసచేస్తే ఆయన ఆత్మ క్షోబిస్తుందని అన్నారు.. ఎన్టీఆర్ నుంచి పార్టీ ని, గుర్తును లాక్కుని వెన్నుపోటు పొడిచిన‌వ్య‌క్తి చంద్ర‌బాబు అని అన్నారు.

కుటుంబ పెద్ద లాంటి వైఎస్ఆర్ లేకపోవడంతోనే రాష్ట్రం రెండు ముక్కలైంది. తిరుపతి ప్రజల చిత్కాకారానికి గురయ్యామన్న భయంతోనే ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయలేదు. ఎన్టీఆర్ వారసుడు మాదిరిగా జగన్ పని చేస్తున్నాడు అంటూ కొడాలి నాని వ్యాఖ్యలు

Related posts