*శివసేన తిరుగుపాటు నేత షిండే సంచలనవ్యాఖ్యలు
*మాకు 50 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉంది.
*మాదే అసలైన శివసేన పార్టీ
*బాల్‌థాక్రే హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళతాం
*మా ఎమ్మెల్యేలు ఎవరూ టచ్‌లేరు.
*టచ్‌లో ఉన్నారని ఆరోపిస్తున్న వారి ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలి..
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగు తూనే ఉంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. తమదే అసలైన శివసేన అని వ్యాఖ్యానించారు. బాల్‌థాక్రే హిందుత్వ నినాదాన్ని తామే ముందుకు తీసుకెళతామని చెప్పారు.
తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఎవరితోనూ టచ్ లో లేరని చెప్పారు. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదని అన్నారు. అందరూ ఇష్టానుసారం వచ్చారు. తాము ద్రోహులం కాదని, శివసైనికులమని అన్నారు.
త్వరలో ముంబైకి వస్తానని స్పష్టం చేశారు .20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని ఆరోపిస్తున్న సంజయ్ రౌత్ వారి పేర్లు బయటపెట్టాలని షిండే సవాల్ విసిరారు.
కాగా అంతకుముందు ఏక్‌నాథ్ షిండే, ఇతర రెబల్ ఎమ్మెల్యేల పై శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ మండిపడ్డారు . రెబల్ ఎమ్మెల్యేలుకు మహారాష్ట్రలో పనేమీ లేదు. కాబట్టి జులై 11 వరకు గువాహటిలోనే విశ్రాంతి తీసుకోవచ్చని, వాళ్లకు మహారాష్ట్రలో పనేమీ లేదు ’ అని సంజయ్ రౌత్ విమర్శించారు.
రెబల్ ఎమ్మెల్యేల్లో కొంతమంది తిరిగొస్తారనే నమ్మకం ఉందన్నారు. తాము రెబల్స్‌గా భావించని ఎమ్మెల్యేలు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వారు తమతో టచ్‌లో ఉన్నారు.వారి కుటుంబాలు కూడా తమతో ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే నమ్మకం ఉందని రౌత్ అన్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో బీజేపీ, దేవేంద్ర ఫడ్నవీస్ తలదూర్చకూడదని ఆయన హెచ్చరించారు. వాళ్లగనుక వేలు పెడితే ప్రధాని నరేంద్రమోడీ కళంకితుడు అవుతారన్నారు.
పవన్ రాజకీయ బినామీ.. టీడీపీ గొంతును వినిపిస్తున్నారు: బొత్స