telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు గవర్నర్

Tamilnadu governor Banvarlal

తమిళనాడులో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.  తాజాగా తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ ఆసుపత్రిలో చేరారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. జూలై 29 నుంచి గవర్నర్ హోం క్వారంటైన్ లో ఉన్నారు.

ఇటీవలే తమిళనాడు రాజ్ భవన్ లో కరోనా కలకలం రేగింది. గవర్నర్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో గవర్నర్ భన్వరిలాల్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజాగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. 

 

Related posts