అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. గూగుల్‌లోని రెండో ‘ఓ’ స్థానంలో సిరా గుర్తు ఉన్న చేతి చూపుడు వేలు సింబల్‌ను పెట్టారు. దీంతో ప్రతిఒక్కరూ ఓటు వేయాలన్న సందేశాన్ని గూగుల్ అందిస్తోంది.
ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డూడుల్‌లో నిక్షిప్తం చేశారు. ఓటు ఎలా వేయాలి, పోలింగ్ బూత్‌లో పాటించాల్సిన నియమాలు, అభ్యర్థుల పేర్లు, పోలింగ్ బూత్‌ను ఎలా తెలుసుకోవాలి, ఓటింగ్‌కు ఏయే గుర్తింపు కార్డులను అనుమతిస్తారు.. ఇలా పలు అంశాలను డూడుల్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఓటు విలువను గుర్తుచేస్తూ గూగుల్ చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
మంగళగిరిలో తనకు సరైన పోటీ లోకేష్ కాదు: వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే