దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీనికి సంబంధించి మరికాసేపట్లో మార్గదర్శకాలు జారీ చేయనుంది. కాగా నాలుగో విడత లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇక లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాల్లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులు కూడా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.