telugu navyamedia
సినిమా వార్తలు

“భీమ్లా నాయక్‌”కు ఆల్ ది బెస్ట్ చెప్పిన చిరు..

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి మల్టీస్టారర్‌ మూవీ భీమ్లా నాయక్‌ రేపు ఫిబ్రవరి 25 విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరు ట్వీట్‌ చేశారు.

అలాగే మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఒక అద్భుతమైన వీడియోను విడుదల చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేశాడు.

ఒకే సెట్లో గాడ్‌ ఫాదర్‌, భీమ్లా నాయక్‌లు ఉన్న సినిమాటిక్‌ వీడియోను చిరంజీవి షేర్‌ చేశారు. ప్రస్తుతం చిరు నటిస్తున్న చిత్రం గాడ్‌ ఫాదర్‌. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

ఇందులో.. భీమ్లా నాయక్‌, గాడ్‌ ఫాదర్‌ సినిమాల షూటింగ్‌ ఒకే చోట జరగడంతో చిరంజీవి ఖైదీ డ్రెస్‌లోనే భీమ్లా నాయక్‌ మూవీ సెట్‌కి వెళ్లి సందడి చేశారు.

ఈ సందర్భంగా తన సోదరుడు, నటుడు పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ రెండు సందర్భాలకు సంబంధించిన సన్నివేశాలు, ఫొటోలను సినిమాటిక్‌గా వీడియోగా క్రియేట్‌ చేసిన వీడియోను రామ్‌ చరణ్‌ ఇదివరకే షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా చిరు ఈ వీడియోను తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. రేపు విడుదల కానున్న భీమ్లా నాయక్‌ టీంకు ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియో అభిమానులను వీప‌రీతంగా ఆకట్టుకుంటోంది. టీమ్ “గాడ్‌ఫాదర్” నుండి “భీమ్లా నాయక్‌”కు ఆల్ ది బెస్ట్ చెప్పే క్యాప్షన్‌తో వీడియో ముగిసింది.

Related posts