telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమామృతం…

sugatri poetry corner
చెలియా! నువ్వు చిరునవ్వులు చిందిస్తే!
నీ అధరాల ఆకాశ వనమున వెలుగుపూలు పూస్తాయి
సఖీ! నీ హృదయ కడలిని చిలికితే!
ప్రేమామృతం ఒలుకుతుంది
నీ కనుల కలువలను తాకితే 
వలపుల పరిమళం వ్యాపిస్తుంది
నీ తనువు తరువును నిమిరితే ప్రేమఫలాలు అందిస్తుంది
మనసు వీణను మీటితే  
 ప్రేమ స్వరాలు పలుకుతాయి
నువ్వు నా బ్రతుకున 
 ప్రేమ దీపం వెలిగిస్తే!
బ్రతుకంతా వెలుగులబాట
వలపుల పాట,ఆనందపు ఊట
పరిమళాల తోట
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts