telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు- నారా లోకేష్

తన తల్లిని కించపర్చిన వారిని ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు.  దుష్ప్రచారం చేస్తున్న మీడియాపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగా ఇవాళ విశాఖకు వచ్చారు. కోర్టు వాయిదా అనంతరం కోర్టు బయట మీడియాతో లోకేశ్​ మాట్లాడారు ..

శాసన సభ సాక్షిగా మా అమ్మ క్యారెక్టర్‌ను దూషించారని, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి కోసం, వారి కుమార్తె కోసం నేను కూడా మాట్లాడవచ్చు. కాని మాకు సంస్కారం అడ్డువస్తుందని అన్నారు. శాసనసభలో మా అమ్మని అవమానించారు.. 2024 తర్వాత మాట్లాడిన వారందరూ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టను… మా తల్లికి నేను శపథం చేస్తున్నానని అన్నారు.

విశాఖలో మున్సిపల్ స్టేడియం ఆస్తులు కూడా తాకట్టు పెడుతున్నారు. రాజధాని కోసం ఒక్క ఇటుకైనా వేశారా.. అని ప్రశ్నించారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు.

తనను కించపర్చిన మూడు పత్రికలపై తాను దావా వేశానని చెప్పారు. ది వీక్ పత్రిక క్షమాపణలు చెప్పిందని, సాక్షి, డెక్కన్ క్రానికల్ కనీసం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు.

2019 అక్టోబ‌ర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చినబాబు చిరుతిళ్లు అనే శీర్షీకతో సాక్షి, డెక్కన్ క్రానికల్‌లో ప్రతికలో కథనం వచ్చింది. అయితే పత్రిక ప్రచురించిన తేదీల్లో అసలు తాను విశాఖపట్నంలోనే లేనన్న లోకేష్ ప్రధాన అభియోగం.

అయితే.. సాక్షిపై రూ.75 కోట్లు, డెక్కన్ క్రానికల్ రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేశానని ఆయన తెలిపారు. ఈనెల 28న, వారికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.

తనను రాజకీయాల్లో ఎదగకూడదని పదేపదే తప్పుడు వార్తలు రాస్తున్నారని, తనకు జరిగిన అన్యాయం మరి ఎవ్వరికీ జరగకుండా ఉండేలా న్యాయ పోరాటం చేస్తానని అన్నారు.

Related posts