telugu navyamedia
సినిమా వార్తలు

‘భీమ్లా నాయక్’ మూవీ ఎలా ఉందంటే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన సినిమా ‘భీమ్లా నాయక్‌ . కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్​ సరసన నిత్యామేనన్ నటించింది. రానాకు జోడీగా మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ నటించింది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించారు.

pawan kalyan bheemla nayak

మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు తెలుగు రీమేక్​ ‘భీమ్లా నాయక్’. ఒరిజినల్​లో బిజు మేనన్ పాత్ర పవన్, పృథ్వీరాజ్​ పాత్రను రానా పోషించారు.

ఇక పోతే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘పవర్​ తుపాను’ వచ్చేసింది. అహంకారి అయిన సైనికాధికారికి, ఆత్మ గౌరవం ఉన్న పోలీసు అధికారికి మధ్య జరిగిన స్టోరీనే ‘భీమ్లా నాయక్‌’.

Image

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు,పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ హైప్ క్రియేట్‌ చేశాయి.భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఫిబ్రవరి 25)‘భీమ్లా నాయక్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌.నిజాయతీ కలిగిన అధికారి. డానియల్‌ శేఖర్‌(రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు.

 రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన  డ్యానీ త‌న‌కు తిరుగులేని విధంగా ప్రవ‌ర్తిస్తూ ఉంటాడు. అదే ఊరికి స‌బ్ ఇన్ స్పెక్టర్ గా వ‌చ్చిన భీమ్లా నాయ‌క్ తో డ్యానీకి చిక్కులు మొద‌ల‌వుతాయి.

భీమ్లా నాయక్‌ కథ..

రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ (రానా) ఒక రోజు రాత్రి కార్ లో తన సొంతూరుకు వెళుతూ ఉంటాడు. ‘భీమ్లా నాయక్’ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌. కారు డ్రైవర్ నడుపుతూంటే .. తను వెనుక సీట్లో నిద్రపోతాడు. ఈ లోగా ఓ చెక్ పోస్ట్ దగ్గర ఆ కార్ ని పోలీస్ లు ఆపుతారు. అది లిక్కర్ ఫ్రీ జోన్. అనుకోకుండా పోలీసుల చెకింగ్ లో డానీ కార్ లో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి.

తాను రిటైర్డ్ హవల్దార్ నని, తనకు అవి కోటాలో వచ్చాయని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆ ఏరియాలో మధ్య నిషేధం ఉండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..డానీ పోలీసుల‌పై తిరగబడతాడు. అది పోలీస్ లకు కోపం తప్పిస్తుంది. ఇంతలో పోలీస్ సబ్ ఇన్సిపెక్టర్ భీమ్లా నాయక్ (పవన్) సీన్ లోకి వస్తాడు. భీమ్లా ఓ నిజాయితీ పరుడైన పోలీస్….డానీ మీద చెయ్యి చేసుకొని.. అతడ్ని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళతాడు. డానీ హర్ట్ అవుతాడు. చాలా అవమానంగా ఫీలవుతాడు.

Thumbnail image

పోలీస్ లు ఎప్పటిలాగే డానీ ఫోన్ లాక్కుని , అతడి కార్ ను సీజ్ చేసి కేస్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈలోగా అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ అతడి ఫోన్ ను చెక్ చేస్తూంటే.. డానీకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని అర్దమవుతుంది. అయినా తన డ్యూడీ ప్రకారం అతడి మీద కేస్ ఫైల్ చేసి అతడ్ని కోర్ట్ కు సబ్ మిట్ చేసే తీరతానని చెబుతాడు. దాంతో డానీకు మండిపోతుంది. ఇగో క్లాష్ మొదలవుతుంది.

అయితే ఒక‌రోజు పోలీస్ స్టేష‌న్‌లో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సీజ్ చేసిన లిక్కర్ బాటిల్ ఓపెన్ చేసి… డానీకి భీమ్లా నాయక్ మందు పోస్తాడు. భీమ్లా నాయక్ మందు పోస్తుండగా డానీ ఫోనులో షూట్ చేసి మీడియాకు విడుదల చేస్తాడు. ఓ సబ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ అలా చేయడం చట్ట వ్యతిరేకం కనుక… రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన భీమ్లా నాయక్ సస్పెండ్ అవుతాడు. అక్కడి నుంచి భీమ్లా కి, డానీకి మధ్య వార్ మొదలవుతుంది. ఇద్దరి వెనక్కి తగ్గని ఇగో ఉన్న వ్యక్తులే.

pawan kalyan bheemla nayak

డ్యానీ తండ్రి అత‌ని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ కూడా భ‌ర్తను ఏ మాత్రం త‌గ్గొద్దంటూ ఎగ‌దోస్తుంటుంది. త‌రువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చివేయ‌డం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయ‌డం వంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. చివ‌ర‌కు బీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒక‌రికిపై ఒక‌రు దాడికి దిగుతారు. ఒక‌రినొక‌రు చిత‌క్కొట్టుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావ‌డం ఖాయమ‌ని తేలుతుంది. అదే స‌మ‌యంలో డ్యానీ భార్య వ‌చ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఆమె కోసం భీమ్లా, డ్యానీని వ‌దిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బ‌దిలీ అవుతాడు. ఓ ఏడాది త‌రువాత భీమ్లా, డ్యానీ క‌లుసుకుంటారు. ఇద్దరూ క‌ర‌చాల‌నం చేసుకోవ‌డంతో క‌థ ముగుస్తుంది.

bheemla nayak

ఎనాలసిస్ …

భీమ్లా నాయక్‌’గా పవన్‌ అదరగొట్టేశాడని, ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ చేసిన సినిమాల్లో ది బెస్ట్‌ ఇదేనని, నటన అదిరిపోయింది. అటు పవన్… ఇటు రానా… ఇద్దరి బదులు మరొకర్ని ఆయా పాత్రల్లో ఊహించడం కష్టమే…ఇద్దరూ అద్భుతంగా నటించారు.

 ఈ సినిమా మళయాళంలో హిట్ అయ్యిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్లుగా ..అలాగే తెలుగు వారి అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ద‌ర్శ‌కుడు చంద్ర తీసారు. పవన్ కల్యాణ్ హుషారుగా, హ్యాండ్స‌మ్‌గాకనిపించారు.

ప‌వ‌న్ త‌న‌దైన బాణీ ప‌లికిస్తూ భీమ్లా పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. ఇక రానా డ్యానీ పాత్రలో జీవించార‌నే చెప్పాలి. నిత్యమీనన్, స‌ముద్రఖ‌ని త‌మ పాత్రల‌కు న్యాయం చేశారు. మిగిలిన పాత్రధారులు సైతం ప‌రిధికి మించ‌కుండా న‌టించారు.

త్రివ్రిమ్‌ డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే బాగుందని చెబుతున్నారు. తమన్ మరోసారి తన సత్తా చూపాడు.రవి కె.చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. కథకు ఏది అవసరమో అంతే ఉంచారు. 

చిత్ర నిర్మాణం విషయంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా రాజీపడలేదు. ఒరిజిన‌ల్ తో పోలిస్తే భీమ్లా నాయ‌క్‌ను మ‌రింత రిచ్ గా చిత్రీక‌రించార‌నిపిస్తుంది.అందుకు నిర్మాత నాగ‌వంశీ అభిరుచి కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

ర‌వి కె.చంద్రన్ సినిమాటోగ్రఫీ క‌నువిందు చేస్తుంది. పాట‌ల్లో రామ‌జోగయ్య రాసిన‌ భీమ్లా నాయ‌క్… టైటిల్ సాంగ్, అడ‌వి త‌ల్లి మాట‌.. పాట ఆక‌ట్టుకుంటాయి. ఇక త్రివిక్రమ్ రాసిన లాలా భీమ్లా… సాంగ్ చెప్ప‌న‌క్క‌ర‌లేదు..అల్రెడీ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించింది.

pawan kalyan bheemla nayak

ప్లస్ పాయింట్స్..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ , రానా ఇర‌గ‌దీసారు.
నిత్య మీన‌న్ కొత్తగా కనిపించడం
ఆక‌ట్టుకొనే క్లైమాక్స్ సీన్స్‌
సెకండాఫ్ లోని హీరో విల‌న్ మ‌ధ్య ఫైట్స్‌

మైన‌స్ పాయింట్స్..

సెకండాఫ్‌ కాస్త నెమ్మదిగా సాగింది.. అంత ఇష్టమేంద‌య్యా.. పాట సినిమాలో క‌నిపించ‌క పోవ‌డం.

రేటింగ్: 4/5

Related posts