telugu navyamedia
సినిమా వార్తలు

“ది బ్యూటీ విత్ నో బ్రెయిన్”… జాన్వీ కపూర్ పై ట్రోలింగ్

Jhanvi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఢిల్లీలో జరిగిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది. హరిందర్ సిక్కా రచించిన “కాలింగ్ సెహ్మత్”కి హిందీ వెర్షన్ ని లాంచ్ చేయడానికి జాన్వీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే ఆ ఈవెంట్ కి వెళ్లిన ఈ బ్యూటీని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం జాన్వీ పుస్తకాన్ని తిప్పి పట్టుకుంది. దీంతో నెటిజన్లు ఆమెని టార్గెట్ చేశారు. “ది బ్యూటీ విత్ నో బ్రెయిన్” అంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే మరీ దారుణంగా జాన్వీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కి జాన్వీ చీర కట్టుకొని వచ్చింది. చీరలో జాన్వీని చూసిన చాలా మంది తన తల్లి మాదిరి ఎంతో అందంగా ఉందని అంటున్నారు.

Related posts