telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి మియా మాల్కోవాతో ఆర్జీవీ… ఈరోజే టీజర్ విడుదల

Mia

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మియా మాల్కోవాతో జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్ )పేరుతో షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. ఆయనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన మరోసారి శృంగార తార మియా మాల్కోవాతో కలిసి షార్ట్‌ ఫిలిమ్ తీస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. ఈ మూవీకి “క్లైమాక్స్” అనే పేరు పెట్టారు. కొన్ని రోజులుగా ఆయన కరోనాపై వెటకారంగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టు గురించి ప్రకటించి అందరినీ ఆశ్చర్చపర్చారు. ‘కరోనా శాపం, లాక్‌డౌన్‌ ఆశీర్వాదంతో నేను, మియా మాల్కోవా కలిసి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు క్లైమాక్స్ టీజర్ విడుదల చేస్తున్నాం’ అని వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా మియా మాల్కోవాతో దిగిన ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related posts