telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ “ఆదిత్యవర్మ” ట్రైలర్

Aditya-Varma

“అర్జున్ రెడ్డి” చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టడంతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. దీంతో “అర్జున్ రెడ్డి” చిత్రం త‌మిళం, హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తమిళంలో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ‌ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో త‌మిళ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. ఒరిజిన‌ల్ వ‌ర్షెన్‌కి సంగీతం అందించిన ర‌ధ‌న్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేస్తున్నారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టిస్తుంది. నిన్న చెన్నైలో చిత్ర ఆడియో వేడుక జ‌రుగగా, ర‌ధ‌న్ స‌మ‌కూర్చిన బాణీలు విడుద‌ల చేశారు. ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. ఇక కొద్ది సేప‌టి క్రితం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ధృవ్‌కి తొలి చిత్రం అయిన‌ప్ప‌టికి వివిధ స‌న్నివేశాల‌లో అద్భుతంగా న‌ట ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చాడు. ప్రేమ‌లో ఫెయిల్ అయిన వ్య‌క్తిగా ధృవ్ ప‌ర్‌ఫార్మెన్స్ సూప‌ర్భ్ అని చెప్పాలి. త‌మిళంలోను ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ర‌వి కె చంద్రన్ ప‌ని చేశారు. ధృవ్ విక్ర‌మ్‌ స‌ర‌స‌న అక్టోబ‌ర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా న‌టించింది. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా న‌టించింది.

Related posts