telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్”లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి

RRR

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. నిన్న రాజమౌళి సినిమాలోని కొన్ని కీలక షాట్స్ ను ఈరోజు తెల్లవారు జాము వరకు తెరకెక్కించారు. అవి తారక్, చరణ్ ల కీలక సన్నివేశాలు అని తెలుస్తోంది. భారీ సెట్స్, బ్లూ మాట్స్ లో రాజమౌళి ఈ సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఫారిన్‌ బ్యూటీ ఒలీవియా మోరిస్‌ను ఇంకా సెట్స్‌లోకి అడుగుపెట్టకుండానే.. ఐరిష్‌ నటి అలిసన్‌ డ్యూడీ షూటింగ్‌లో జాయిన్‌ అయింది. ఈ అమ్మడు సినిమాలో లేడీ స్కాట్‌ పాత్రలో కనిపించనుంది. బ్రిటీష్‌ సంస్థానంలో అధికారిణిగా కనిపించనుందని, విలన్‌ తరహాగా ఆమె పాత్ర వుంటుందని టాక్‌. అయితే షూటింగ్ పాల్గొనడానికి అలిసన్ డూడి ఇండియాకు వచ్చిందన్న విషయం తెలిసిందే.

Related posts