telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్యూయెల్ రోల్ లో కన్పించి సర్ప్రైజ్ చేసిన మహేష్

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఓ యాడ్ కోసం డ్యూయల్ రోల్ లో కనిపించి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఈ డ్యూయల్ రోల్‌ లో మహేష్ అన్న తమ్ముడుగా నటించాడు. ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌’ షురూ అంటూ తాజాగా మహేష్ పైన యాడ్ చేశారు. ఈ యాడ్ ని తాజాగా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ యాడ్ లో మహేష్ బాబు మీసాలతో కనిపించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.ఇందులో మహేష్ బాబు మరింత అందంగా కనిపించడం, డ్యూయల్ రోల్‌లో చాలా రోజుల తర్వాత కనిపించడంతో సూపర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ యాప్ కి వీపరీతమైన క్రేజ్ వస్తోంది. ఇక చివరిగా మహేష్ బాబు నాని సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించగా, అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొడుకు దిద్దిన కాపురం సినిమాలో డ్యూయల్ రోల్‌లో కనిపించారు. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సినిమాలో నటిస్తున్నాడు.

Related posts