telugu navyamedia
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ తో నాని సినిమా… ఫస్ట్ లుక్ విడుదల

HIT

నేచురల్ స్టార్ నాని ఇటీవలే “గ్యాంగ్ లీడర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సుధీర్ బాబుతో కలిసి నటిస్తున్న “వి” సినిమాతో బిజీగా ఉన్నారు. నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విభిన్న సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘వాల్‌పోస్టర్ సినిమా’ బ్యానర్‌ను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నాడు. మొదటి ప్రయత్నంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అ!’ వంటి విభిన్నమైన సినిమా నిర్మించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. తాజాగా తన నిర్మాణంలో మరో సినిమాను ప్రారంభించాడు. “ఫలక్‌నుమా దాస్” సినిమాతో గుర్తింపు సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా సినిమాను నిర్మించనున్నాడు. ఈ సినిమాకు “హిట్” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను నూతన దర్శకుడు శైలేష్ కొలను రూపొందించనున్నాడు. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.

Related posts