telugu navyamedia
సినిమా వార్తలు

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం..ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ హఠాన్మరణం

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌ కౌశిక్ ఎల్‌ఎం హఠాన్మరణం చెందారు. సోమవారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది.

ఎప్పటికప్పుడు సినిమా అప్‌డేట్స్‌ను అందించడం, ఇంటర్వ్యూలతో కౌశిల్‌ సోషల్‌ మీడియాలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.

సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడంలో తమిళనాట కౌశిక్‌కు మంచి పేరుంది. ఈయన చనిపోయే ఆరుగంటలకు ముందు కూడా ఇటీవల విడుదలైన ‘సీతారామం’ సినిమాకు సంబంధించిన ట్వీట్‌ చేశారు.

Vijay Devarakonda, Keerthy Suresh, Dulquer Salmaan and other south celebs mourn the loss of known film critic Kaushik LM

ఆయన ఫిల్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ, ఫిల్మ్ రివ్యూయర్, క్రికెట్ అండ్​ టెన్నిస్ బఫ్​గా గుర్తింపు పొందారు.

కాగా..కౌశిక్‌ మృతి పట్ల దుల్కర్​ సల్మాన్​, కార్తి, విజయ్​దేవరకొండ, ధనుష్​, కీర్తిసురేశ్​ సహా పలువురు సినీ సెల‌బ్రెటీలు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Related posts