telugu navyamedia
సినిమా వార్తలు

ఒక సీన్ కోసం రెండు రోజులు… నీళ్లు కూడా తాగకుండా…

Nishanth

టీవీ సీరియల్స్‌లో నటించే వారంతా గంటల తరబడి షూటింగ్‌లో పాల్గొనాల్సి వస్తుంటుంది. ఈ నేపధ్యంలో వారు ఎదుర్కొనే సమస్యలు చాలామందికి తెలియవు. తాజాగా హిందీ సీరియల్ నటుడు నిశాంత్ మల్కానీ ఒక సీన్ కోసం రెండు రోజుల పాటు నీరు తాగకుండా గడిపారు. ఈ సీరియల్ షూటింగ్‌లో నిశాంత్ ఒక స్పెషల్ సీక్వెన్స్ కోసం బేర్ బాడీతో కనిపించాల్సి వుంది. ఇందుకోసం మండుటెండలో నిశాంత్ కేవలం నీటినే కాకుండా నీరు కలిగిన పదార్థాలను కూడా తీసుకోలేదు. ఈ సందర్బంగా నిశాంత్ మాట్లాడుతూ “సాధారణంగా ఇలా చేయడం వలన శరీరానికి విశ్రాంతినివ్వాల్సి వుంటుంది. కానీ నేను అలా చేయలేదు. ఈ సీరియల్‌లో నాది లీడ్ రోల్. ఇంత మండుటెండల్లోనూ ఈ సీన్ పూర్తి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సీరియల్‌లోని కథను అనుసరించి మండుటెండలో మహాహారతి ఇవ్వాల్సి వుంటుంది. భార్యను అనారోగ్యం నుంచి తప్పించమని భగవంతుడిని వేడుకునే సీన్ అది. దీనిని పూర్తి స్థాయిలో పండించేందుకు ఇంతలా శ్రమించాల్సి వచ్చింది” అని నిశాంత్ చెప్పుకొచ్చారు.

Related posts