telugu navyamedia
సినిమా వార్తలు

ఆలియా- రణ్​బీర్​కు కవలలు? – వీడియో వైర‌ల్‌

బాలీవుడ్​ స్టార్​ క‌పుల్ ఆలియా భట్​- రణ్​బీర్​ కపూర్​ 2022 ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

అయితే పెళ్లైన రెండు నెలలకే.. ఆలియా తాను గర్భవతి అని ప్రకటించింది. ప్రస్తుతం షూటింగ్​లకు గ్యాప్​ ఇచ్చి.. ప్రెగ్నెన్సీ పీరియడ్‌ను ఎంజాయ్​ చేస్తోంది.  అయితే తాజాగా అయితే ఆమె ప్రెగ్నెన్సీపై మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఆలియా కడుపులో కవలలు ఉన్నారట.

ఆలియా భట్ కడుపులో కవలలు ఉన్నారనడానికి మరో కారణం కూడా ఉందట. ఆలియా భట్​- రణ్​బీర్ జాతకం ప్రకారం.. వీరు కవలలకు తల్లిదండ్రులు అవుతారని ఓ ప్రసిద్ధ  జ్యోతిషుడు గతంలోనే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్‌బీర్‌తో యాంకర్‌ సరదాగా ఒక గేమ్‌ ఆడించారు. ఈ గేమ్‌లో ‘రెండు నిజాలు, ఒక అబద్ధం’ చెప్పాల్సిందిగా రణ్‌బీర్‌ను ఆ యాంకర్‌ కోరారు. ఈ గేమ్‌లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్‌బీర్‌ కపూర్.

Happy birthday Alia Bhatt: Check out her most loved-up moments with boyfriend Ranbir Kapoor. See pics - Hindustan Times

యాంకర్‌ అడిగిన ప్రశ్నకు ‘నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్‌ తీసుకోబోతున్నాను’ అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్‌బీర్‌.

Alia Bhatt and Ranbir Kapoor expecting first child, announce pregnancy on social media : Bollywood News – – LatestBollyWoodNews

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్‌.

Related posts