ప్రపంచ కప్ ఎవరిది అనే చర్చ ప్రస్తుతం సామజిక మాధ్యమాల వేదికగా జరుగుతుంది. ఎవరికి వారే మా టీం అంటే మా టీం అంటూ పోటీలు, బెట్టింగులు.. ఒకింత అల్లరి కాదు.. వీళ్ళ అభిమానం ఏమోగానీ, అంచనాలు పెంచుకుంటూపోతున్నారు. అక్కడ ఆడవారికి తడిచిమోపెడు అవుతుంది. పాయింట్ల పట్టికలో ముందున్న రెండు టీం లలో ఒకరిది అనేది అందరికి తెలిసిందే,కానీ అప్పటిదాకా ఆగలేక ఈ చర్చలతో ఇంకాస్త వేడి పెంచుతున్నారు. వారిలో కొందరు ఇంగ్లండ్ అంటే, ఇంకొందరు భారత్‌దే గెలుపు అంటున్నారు. మరికొందరు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పేర్లు చెబుతున్నారు. మరోవైపు 1992 ప్రపంచకప్‌తో పోల్చుతూ పాక్ రెండోసారి కప్పు కొట్టుకెళ్లడం ఖాయమంటున్నారు.
వీరందరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఈ చర్చలో తనకు పాల్గొనాలనిపించిందేమో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాత్రం ఈ విషయంలో కొంత స్పష్టతతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ సేనను ఓడించిన వారే కప్పును చేజిక్కించుకుంటారని చెబుతున్నాడు. తాను ఇదే మాటపై నిల్చుంటానని స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగని భారత్.. గురువారం విండీస్‌పై 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన అనంతరం వాన్ ఈ ట్వీట్ చేయడం గమనార్షం.