telugu navyamedia
ట్రెండింగ్

విజయ్ సినిమాలో రష్మిక !

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి అరంగేట్రం ఇచ్చేందుకు చూస్తోంది. పర్వీజ్ షేక్, అసీమ్ అరోరాలు ఈ సినిమా కథను రాశారు. ఇందులో సిద్దార్థ్ మల్‌హోత్రా, రష్మికాలు ప్రధాన పాత్రల్లో చేయనున్నారు.  ఇది ఇలా ఉండగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్ట్స్ మూవీలో ఛాన్స్ కోసం… ఇద్దరు బెంగుళూరు బ్యూటీస్, ఒక ముంబై లేడీ ఎదురు చూస్తున్నారట! మహేశ్ తో ఒక సినిమా, రామ్ చరణ్ తో మరో సినిమా చేసి ముంబైకి వెళ్లిపోయింది కియారా అద్వాణీ. ప్రస్తుతం బీ-టౌన్ లో ఆమె జోరు బాగానే ఉంది. అయితే, సౌత్ లో కూడా కియారా కోసం కుర్రాళ్లు ఆశగానే ఎదురు చూస్తున్నారు.  అయితే, యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోయే అవెయిటెడ్ మూవీలో రశ్మిక కూడా కనిపించవచ్చట. కియారా, పూజా హెగ్డేతో పాటూ దర్శకనిర్మాతలు మన ‘భీష్మ’ బ్యూటీని కూడా కన్సిడర్ చేస్తున్నట్టు చెన్నై టాక్. చూడాలి మరి, ఇళయ దళపతితో కియారా, పూజా, రశ్మికల్లో ఎవరు ఫైనల్ గా రొమాన్స్ చేస్తారో?

Related posts