తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ఎందరో ప్రజాప్రతినిధులు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలోని ఏడుగురు సిబ్బంది కరోనా సోకింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మన్లు ఉన్నారు.
దీంతో మంత్రితోపాటు ఆయన పేషీలోని మిగతా సిబ్బంది కూడా పరీక్షలు చేయించుకున్నారు. మంత్రి సహా అందరికీ నెగటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మంత్రి తన పేషీకి రాలేదని, ఇంట్లోనే ఉండి సందర్శకులను కలిశారని అధికారులు తెలిపారు.