telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్ బయట ఐపీఎల్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది : బీసీసీఐ అధికారి

ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ నిర్వహణ కోసం వచ్చిన ఆఫర్లపై ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ సింగ్ ధూమల్ వెల్లడించాడు. రాయిటర్స్‌తో మాట్లాడిన ఆయన పలు దేశాలు ఇచ్చిన ఆఫర్లపై స్పందించాడు. ‘అన్ని ఆప్షన్స్‌ను మేం పరిశీలిస్తాం. కానీ ఇప్పుడు కాదు. సరైన టైమ్‌లో దానిపై సరైన నిర్ణయం తీసుకుంటాం. మిగతా మ్యాచ్‌లను కంప్లీట్ చేసేందుకు ఎలాంటి చర్యలు అవసరమో చూస్తున్నాం. ఇంగ్లండ్ కౌంటీలు ఇచ్చిన ఆఫర్స్‌పై కూడా ఎలాంటి చర్చ జరగలేదు. ఇప్పుడు చర్చించడం తొందరపాటు అవుతోంది. ఏదేమైనా ఐపీఎల్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలిసిపోయింది. ప్రతీ ఒక్కరు మ్యాచ్‌లు కావాలని కోరుకుంటున్నారు. ఇండియా అవతల కూడా ఐపీఎల్‌కు భారీ ఫాలోయింగ్ వచ్చింది’అని ధూమల్ పేర్కొన్నాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా టీ20 వరల్డ్ కప్‌పైనే ఉందన్నారు. మెగా ఈవెంట్ ప్రిపరేషన్స్‌ను ఫైనలైజ్ చేయడమే తమ టార్గెట్ అని చెప్పారు. మెరిలీన్ క్రికెట్ బోర్డు, వార్‌విక్‌షైర్, సర్రే వంటి ఇంగ్లండ్ కౌంటీ టీమ్స్ ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు సైతం తమ దేశంలో నిర్వహించేందుకు బీసీసీఐకి ఆఫరిచ్చింది.

Related posts