ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఉపఎన్నికల్లో బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) తొలిసారిగా పోటీచేయనుంది. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఉపఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
బీఎస్పీ ఇప్పటివరకు ఇతర పార్టీలకు మద్దతునిస్తూ వస్తున్నది. అయితే గత కొంత కాలంగా రాష్ట్రంలో పార్టీ ప్రాభవాన్ని కోల్పోతుండటంతో బరిలోకి దిగేందుకు సిద్దమైనట్టు తెలుస్తోంది.
2022లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఎన్నికల ద్వారా ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవచ్చని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని ఎనిమిది స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.