telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ఎన్నికల పై కేసు వేస్తా : కేఏ పాల్

KA Paul comments Chandrababu

ఏపీలో పోలింగ్ జరిగిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని ఈసీకి 8 ప్రశ్నలతో వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు.రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం కావాలని డిమాండ్ చేశారు. పోలింగ్ ఆలస్యంపై బాధ్యులు ఎవరు?. నూటికి 80 శాతం ఈవీఎంలు ఎందుకు పని చేయలేదు.

తెల్లవారు జామున మూడు గంటల వరకు ఎందుకు పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన రెండు, మూడు గంటల్లో సీజ్ చేయాల్సిన ఈవీఎంలు పద్దెనిమిది గంటల సమయం గడిచేంత వరకు ఎందుకు లాక్ చేయలేదు. ఈవీఎంలలో పన్నెండో బటన్ నొక్కితే రెండో బటన్ లో ఉన్న అభ్యర్థికి ఓటు పడిందని చెప్పిన వారి దగ్గర ఎందుకు లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకోలేదు. పోలింగ్ అబ్జర్వర్లుగా దక్షిణాదివారిని కాకుండా ఉత్తరాది వారిని ఎందుకు నియమించారు.

వీవీ ప్యాడ్ స్లిప్పుకు మూడు సెకన్లే ఎందుకు కనబడుతుంది. పోలింగ్ సమయంలో దాడులను ఎందుకు నియంత్రించలేకపోయారు. ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా ఎందుకు తీసుకోలేదు. ఈ ఎనిమిది ప్రశ్నలకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి లిఖిత పూర్వకంగా సమాధానం కావాలన్నారు పాల్. అన్ని అంశాలపై రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తున్నానని పాల్ హెచ్చరించారు.

Related posts