telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌..షెడ్యూల్ విడుదల.

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన నేపథ్యంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ను తేదీలు ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈసారి మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు తెలిపింది.

ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్, మెడికల్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశాల కమిటీ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ మొత్తం మూడు విడతల్లో పూర్తి చేయనున్నారు.

సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ సమావేశంలో పాల్గొన్నారు. కాగా అగ్రికల్చర్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వ్యవసాయ వర్సిటీ తర్వాత ప్రకటిస్తుంది.

ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా

మొదటి విడత కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌

ఆగ‌స్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్
ఆగ‌స్టు 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

రెండో విడత కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌

సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్ లు
సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ద్వారా

(తుది ద‌శ‌) మూడో విడత కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌

అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

Related posts