telugu navyamedia
తెలంగాణ వార్తలు

తన పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే..ఆ విషయం పార్టీ నేతలనే అడగండి ..

*బీజేపీ నాయ‌క‌త్వం పై విజ‌య‌శాంతి అసంతృప్తి
*నేను ఎక్క‌డ నుంచి పోటీ చేయాలో పార్టీ నిర్ణ‌యిస్తుంది..
*మాట్లాడానికి ఎందుకు ఇవ్వ‌డం లేదో పార్టీ నిర్ణ‌యిస్తుంది ..
*రాష్ర్ట నాయ‌క‌త్వం ఎందుకు నిశ్శ‌బ్దంలో పెట్టింది..
*బీజేపీ రాష్ర్ట నాయ‌క‌త్వంపై బండిసంజ‌య్, లక్ష్మ‌ణ్‌కే చెప్పాలి.

బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందంటూ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు యాక్టివ్గా లేరంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ..పార్టీ రాష్ట్ర నాయకత్వం నన్ను నిశ్శబ్దంలో ఉంచింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీలో మాట్లాడటానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులకు తెలిపారు.

అంతేకాకుండా నేను అసంతృప్తిగా ఉన్నానో లేనో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు.

Image

ఈ రోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుదాం అనుకున్నా.. కానీ లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు వెళ్లిపోయారు.. నాకు ఏమీ అర్ధం కాలేదు..నా సేవలను ఏ విధంగా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్ కే తెలియాలని వ్యాఖ్యానించారు..నేను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది’’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం.. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం అంటూ విజయశాంతి పేర్కొన్నారు. తన పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రేనని.. రాములమ్మగా, ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నానని.. తాను పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషినంటూ నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Image

జాతీయ పార్టీతో‌ ఇబ్బంది లేదు.. రాష్ట్ర నాయకత్వమే ఉపయోగించుకోవటం లేదు. సీనియర్ నేతలను కలుపుకుని పోకుంటే పార్టీకే నష్టం. నా వల్ల పార్టీలో కొందరు నేతలు అభద్రతాభావంతో ఉన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించాలి’’ అని విజయశాంతి అన్నారు.

Related posts