telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ బూతులకు రాని ఓటర్లు…

హైదరాబాద్ లో ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్ స్టేషన్లు ఓటర్లు లేక వెలవెలబోతున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఇప్పటి వరకూ 20 శాతం కూడా పోలింగ్‌ దాటలేదు. నిజంగా, ఇది 400 ఏళ్ల చరిత్రగల భాగ్య నగరానికి సిగ్గుచేటు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పోలింగ్ బూతుల్లో ఇప్పటి వరకూ ఓటర్లే రాలేదు. దీంతో చేసేదేమీ లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. సాయంత్రం 6 గంటలకు అంటే మరో మూడు గంటల్లో పోలింగ్ ముగిసిపోనుంది.. పోలింగ్ శాతం ఇంత తక్కువగా ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. నగరు శివారులో మాత్రం ఓటేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. సిటీలో మధ్యాహ్నం దాటినప్పటికీ ఓటేయడానికి జనాలు ఇళ్ల నుంచి బయటి రావట్లేదు. హైదరాబాద్ యువత తీరుపై విమర్శలు వస్తున్నాయి.. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తారు కానీ.. ఓటేసేందుకు ముందుకు రారా అంటూ మండిపడుతున్నారు. ఇక ఓటు విషయంలో ఆదర్శంగా నిలిచారు వికలాంగులు, వయోవృద్ధులు.. కొన్ని చోట్ల వృద్దుల ఓట్లు గల్లంతు అయితే పోరాడి మరి ఓట్లు వేశారు. ఇలాంటి చురుకుదనం యువతలో కనిపించపోవడం ఆశ్యర్యానికి గురిచేస్తుంది.

Related posts