telugu navyamedia
క్రీడలు వార్తలు

స్మిత్ పై గంభీర్ ప్రశంశల వర్షం…

ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన రెండు వన్డే మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లలో ఆసీస్ సాధించిన విజయంలో ఆ జట్టు కీలక ఆటగాడు స్టీవ్ స్మిత్ ముఖ్య పాత్ర పోషించాడు. రెండు మ్యాచ్ లలో రెండు శతకాలు బాదిన స్మిత్ పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. అతను కోహ్లీకి ఎంతో దూరంలో లేదు అని పేర్కొన్నాడు. అయితే గంభీర్ మాటాడుతూ… స్మిత్ టీం ఇండియాను అర్ధం చేసుకున్నాడు… కానీ టీ ఇండియా స్మిత్ ను అర్థం చేసుకోలేదు అని అన్నాడు. వన్డేలో వరుస శతకాలు బాదడం అంత సులువు కాదు. అయితే ప్రస్తుతం వన్డేలో నెంబర్ వన్ ఆటగాడు విరాట్ కోహ్లీ. కానీ అతడిని చేరుకోవడానికి స్మిత్ కు ఎంతో సమయం పట్టదు అని పేర్కొనాడు. ఈ సుదీర్ఘ పర్యటనలో ఇది  కేవలం ఆరంభం మాత్రమే.. కాబట్టి త్వరగా అతడిని ఔట్ చేసే విధానాన్ని భారత్ కనిపెట్టక పోతే చాలా నష్టం కలుగుతుంది అని గంభీర్ పేర్కొన్నాడు. చూడాలి మరి రేపు జరగబోయే మూడో వన్డేల్లో ఏం కరుగుతుంది అనేది.

Related posts