అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. అయితే గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు సంబంధించిన అనేక కంపెనీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ తో పాటుగా కొన్ని కంపెనీలపై నిషేధం విధించారు. దీంతో ఆ దేశం ఆర్ధికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అయితే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. బైడెన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరి 20 వ తేదీన బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. బైడెన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చైనాతో సంబంధాలు ఎలా ఉంటాయి అనే దానిపై ఆధారపడి అమెరికాతో సంబంధాలు ఉంటాయని అనుకున్నారు. అయితే, చైనా దూకుడుగా వ్యవహరించి కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ఎగుమతి చేసే రేర్ ఎర్త్ మెటల్స్ పై నిషేధం విధించింది. చైనా నుంచి ఈ మెటల్స్ ఎక్కువగా అమెరికాకు ఎగుమతి అవుతుంది. వీటిని ఆయుధాల తయారీ, విమానాల తయారీ, ఇతర విలువైన వస్తువుల తయారీలో వినియోగిస్తారు. ప్రపంచం ఉత్పత్తి చేసే అరుదైన ఎర్త్ మెటల్స్ లో 37శాతం చైనాలోనే ఉన్నాయి. పర్యావరణ చట్టాలు చైనాలో అమలులో లేవు కాబట్టి ఈ విలువైన ఖనిజాన్ని వెలికి తీస్తున్నారు. ఎవరైనా సరే చైనా నుంచి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ను అమెరికాకు ఎగుమతి చేయాలంటే చైనా అనుమతి తప్పనిసరి చేసింది. అలా కాకుండా రహస్యంగా ఎగుమతి చేయాలనీ చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా 7,60,000 డాలర్లకు పైగా జరిమానా విధించాలని నిర్ణయించింది.
previous post
పీసీసీ పదవి కోసం రేవంత్ చిల్లరగా వ్యవహరిస్తున్నారు: విప్ బోడకుంటి