telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీటింగ్ లో సీఎంపై సింగర్ సాంగ్ … వీడియో వైరల్

Udit

దేశంలోనే అతి పెద్ద ఫిలింసిటీలోని నోయిడాలో నిర్మించాలనుకుంటున్నట్లు ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చర్చ జరపడానికి కొందరు సినీ ప్రముఖులను ఆయన మీటింగ్‌కు ఆహ్వానించారు. తాను ఓ అతి పెద్ద ఫిలింసిటీని కట్టాలనుకుంటున్న యోగి ఆదిత్యనాథ్‌ చెప్పారు. దీంతో వెంటనే ఈ మీటింగ్ లో పాల్గొన్న ప్రముఖ సింగర్ ఉదిత్‌ నారాయణ్‌ కుర్చీలో నుండి లేచి ‘లగాన్‌’ సినిమాలోని ‘మితువా మితువా…’ పాటను పాడారు. యోగి ఆదిత్యనాథ్‌ పాట విని ఉదిత్‌ నారాయణ్‌కు నమస్కారం చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Related posts