telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోంది: కేసీఆర్‌

KCR cm telangana

పౌరసత్వ సవరణ చట్టం దేశాన్ని కుదిపేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. శాసనసభ సమావేశాల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై విస్తృతంగా చర్చ జరగాలని ఆయన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ బకాయిలు రావడం లేదని కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు. జీఎస్టీ విషయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని సీఎం చెప్పారు.

సీఏఏపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సీఏఏపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్‌ గురించి మాట్లాడటమే. బీజేపీ ఎమ్మెల్యే కూడా తన వాదన వినిపించవచ్చు. సీఏఏపై అందరి సభ్యులకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నా. సీఏఏపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు. సీఏఏ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కూడా సవివరంగా మాట్లాడొచ్చు. సీఏఏ చాలా కీలకమైన అంశం, దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు.

Related posts