telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నిలకడగా పసిడి… భారీగా పడిపోయిన వెండి ధరలు

క్రిస్మస్‌ పండుగ నేపథ్యంలో బంగారం ధరలు నిన్న నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోగా.. వెండి ధరలు మాత్రం పడిపోయాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,210 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 48, 780 వద్ద ముగిసింది. అయితే శనివారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,940 కి చేరింది. అయితే ఈరోజు కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ. 71, 200 పలుకుతుంది.

Related posts