చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన ఉన్నట్లుండి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్పాయిట్‌మెంట్ కోరడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు… సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనంగా మారింది. పవన్ కల్యాణ్ కూడా పూర్తిగా జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతీసారి ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు, జగన్ భేటీ ఏంటి అంటూ వార్తలు వచ్చాయి. అన్నింటికీ మించి అక్టోబర్ 11నే అనుకున్న అప్పాయిట్‌మెంట్ కాస్తా మూడు రోజులు ఆలస్యం కావడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు చివరికి అక్టోబర్ 14 లంచ్ బ్రేక్‌కు కలవబోతున్నారు జగన్, చిరంజీవి. ఈ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనేది అంతా ఆసక్తిగా చూస్తున్న తరుణంలో.. ఈ ఇద్దరి భేటీపై కీలకమైన విషయాలు బయటికి చెప్పాడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. చిరంజీవి, జగన్ మీటింగ్ వెనక ఎలాంటి రాజకీయ కోణాలు లేవని, కేవలం సినిమా పరంగానే ఈ చర్చలు ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. సైరా సినిమా చూడ్డానికి ముఖ్యమంత్రిని చిరు ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నాడని, అందుకే అప్పాయిట్‌మెంట్ కూడా అడిగాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో గవర్నర్ తమిళిసైను ప్రత్యేకంగా ఆహ్వానించి షో వేసాడు మెగాస్టార్. ఇప్పుడు జగన్‌కు కూడా తన సినిమాను చూపించాలనుకుంటున్నాడు చిరు. ఏదేమైనా కూడా చిరు, జగన్ భేటీ మాత్రం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది.
previous post
దిశ ఘటనపై పవన్ వ్యాఖ్యలు వక్రీకరణ… కుహనా మేధావులు అంటూ నాగబాబు సమాధానం