telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఈఎస్ఐ స్కాం : నాయిని అల్లుడి చుట్టూ ఉచ్చు…

ఇక ఈఎస్ఐ స్కాంలో ఈడీ గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది. 24 గంటల పాటు దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  24 గంటల పాటు ఈ సోదాలు చేసిన ఈడీ విలువైన వస్తువులు, డాకుమెంట్స్, నగదు స్వాధీనం చేసుకుంది. నగదుతో పాటు పెద్ద ఎత్తున బ్లాంక్ చెక్ లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.  ఈఎస్ఐ స్కామ్ లో శ్రీనివాస్ రెడ్డి, ముకుంద రెడ్డిలది కీలక పాత్ర అని ఈడీ గుర్తించింది. అయితే ఈఎస్ఐ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీ పేర్లతో ముకుందా రెడ్డి, నాయిని అల్లుడు  వ్యాపారాలు చేసినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేరు మీద ముకుందరెడ్డి వ్యాపారాలు చేసినట్లు సమాచారం. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. తక్కువ ధరకు దొరికే పరికరాలు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలు రాబట్టినట్లు గుర్తించారు. దేవికారాణి,  ముకుంద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,  శ్రీహరి బాబులు కలిసి ఈ స్కాంకు పాల్పడినట్లు ఈడి నిర్ధారణకు వచ్చింది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు పెద్ద మొత్తంలో మళ్లించినట్లు నిర్ధారణకు వచ్చింది. పలు ఫార్మా కంపెనీలతో పాటుగా రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా గ్యాంగ్ పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దేవికారాణి ఏకంగా గా తమిళనాడు కర్ణాటక ఆంధ్ర లో భారీగా ఆస్తులు కొనుగోలు చేశారని, పిఎంజె జూవెల్స్ లో పెద్ద మొత్తంలో దేవికారాణి నగలు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Related posts