telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : … కేజ్రీవాల్ పై .. మరో ప్రాంతీయ పార్టీ..

kejriwal on his campaign in ap

దేశరాజధానిలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింతగా రాజుకుంది.. ఓటుబ్యాంకు చీల్చి గెలిచే దిశగా పావులు కదులుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఆరు గంటల పాటు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎదురుచూసిన తర్వాత 45వ టోకెన్‌గా కేజ్రీ నామినేషన్ వేశారు. కేజ్రీవాల్‌తో పాటు మరో 65 మంది నామినేషన్ వేయడం విశేషం. దీంతో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న అభ్యర్థుల లిస్ట్ 93కు చేరింది. సీఎంపై పోటీకి దిగిన వారిలో ఐదుగురు క్యాబ్ డ్రైవర్లు, పది మంది ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) మాజీ ఉద్యోగులు, 2011లో అవినీతిపై జరిగిన పోరాటంలో పాల్గొన్న నలుగురు సామాజిక కార్యకర్తలు, ‘చెక్ దే ఇండియా’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన ఓ జాతీయ స్థాయి హాకీ ఆటగాడు కూడా ఉన్నారు. 2018లో కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా పోరాడిన డీటీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో నేను ఒకడిని. అందరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒకే వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేశాము. అందువల్ల మా ఉద్యోగాలుపోయాయి. రాజకీయాల్లో అతన్ని ఓడించేందుకు ఇదే మాకు సరైన అవకాశం అని నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఒకరైన మనోజ్ శర్మ అన్నారు.

‘అంజన్ ఆద్మీ పార్టీ’ సభ్యుడు, జాతీయ స్థాయి అథ్లెట్ శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ..స్వరాజ్యం తీసుకువచ్చే సత్తా మాకు ఉంది కావట్టే మేము పోటీకి దిగాము. కేజ్రీవాల్‌ కంటే మెరుగైన పాలన అందిస్తాము” అని అన్నారు. 2009లో ఢిల్లీ మందిర్ మార్గ్‌లో అగ్ని ప్రమాదానికి గురైన వారిని కాపాడటం ద్వారా శైలేంద్ర సింగ్ వెలుగులోకి వచ్చారు. ఆ ఘటనకు సంబంధించిన చిత్రాలను ఆ పార్టీ వాళ్లు ప్రచారానికి వాడారు. వాళ్లు కూడా ఆప్ పార్టీలానే గాంధీ టోపీలు ధరించారు. కానీ, అవి నలుపువి. కేజ్రీవాల్ కంటే ముందు 44వ టోకెన్‌తో నామినేషన్ వేసిన పవన్ కుమార్ అనే క్యాబ్ డ్రైవర్ ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపుతుందని ఆరోపించారు. ”ఆటో డ్రైవర్ల రేట్లు మారాయి. కానీ, మా కోసం ఎటువంటి పథకాలు లేవు. క్యాబ్ డ్రైవర్లు ఎమ్మెల్యే కావడానికి ఇదే సరైన సమయం” అని పవన్ స్పష్టం చేశారు.

Related posts