telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ చీఫ్ రేషన్ ఆఫీసర్ కీలక ప్రకటన…

హైదరాబాద్ చీఫ్ రేషన్ ఆఫీసర్ ఒక కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ రేషన్ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక మీదట హైదరాబాద్ జిల్లాలో రేషన్ కార్డు వినియోగదారులకు ఐరిస్ లేదా ఫోన్ ఓటిపీ ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరగనుందని ప్రకటించారు. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల మేరకు వచ్చే నెల 1వ తేదీ నుండి ఐరిస్ లేదా ఓటిపి ద్వారా పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. కరోనా వైరస్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వేలిముద్ర అధంటికేషన్ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్న ఆయన ఆధార్ కార్డ్ కు ఫోన్ నెంబర్ లేనియెడల అనుసంధానం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డ్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం లేకపోతే రేషన్ పంపిణీ చేయలేమని ఆయన చెప్పారు. రేషన్ కార్డుదారులు తమ ఫోన్ నంబర్లను ఆధార్ కార్డు కు అనుసంధానం చేయాలని, తద్వారా సరకులు పొందే సమయం లో ఈ పాస్ యంత్రం నుంచి ఫోన్ కు వన్ టైం పాస్ వర్డ్ (ఓటీపీ) వస్తుంది. దాన్ని బయో మెట్రిక్ యంత్రం లో నమోదు చేసిన వెంటనే సరకులను డీలర్లు ఇస్తారు.  ఈ నూతన పద్ధతి వల్ల ప్రజా పంపిణీ లో అక్రమాలకు అడ్డుకునే అవకాశముందని అధికారులు అంటున్నారు. జనవరి 31 లోగా ప్రజలు తప్పనిసరిగా ఫోన్ నంబర్ లను ఆధార్ కార్డు కు అనుసంధానం చేయాలని కోరారు. అయితే మీకు హైదరాబద్ లో కార్డు ఉంటె త్వరగా అనుసంధానం చేసుకోండి.

Related posts