పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలనీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.
నీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష జరిపారు. కేసీఆర్ చేసిన ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగగ్ షెకావత్ అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే సమాధానాలిద్దామని చెప్పినట్లు తెలిసింది.
తెలంగాణతో స్నేహ పూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇదే సమయంలో కృష్ణా ట్రైబ్యునల్ కేటాయింపుల మేరకే చేపడుతున్న ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రాజెక్టులపై రాష్ట్రం విడిపోవడానికి ముందు నుంచి అమలులో ఉన్న ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టేందుకు కృషి చేయాలని, పునరావాస కార్యక్రమాలపై దృష్టిని సారించాలని కూడా జగన్ ఆదేశించారు. ప్రాజెక్టు వ్యయంపై పెట్టిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను తయారు చేసి కేంద్రానికి పంపాలని సూచించారు. వివిధ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని ఆదేశించారు.
అమరావతి విషయంలో కేంద్రం స్పష్టత: కన్నా