లోక్‌సభ ఎన్నికల రెండో విడుతకు రంగం సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతుంది. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేసి వచ్చారు. అజిత్, నటుడు అరుణ్ విజయ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తన కూతురు శృతి హాసన్‌తో కలిసి ఆల్వార్ పేట కార్పోరేషన్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తమిళనాడులోని 38 లోక్‌సభ సీట్లతోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ బరిలో 822 మంది అభ్యర్థులు ఉండగా, అసెంబ్లీలో ప్రవేశించేందుకు 269 మంది పోటీ పడుతున్నారు. దాదాపు 6 కోట్ల మంది తమిళులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
previous post
next post
టీడీపీ డైరెక్షన్ లో, బీజేపీ ముసుగులో.. పవన్ పై మంత్రి వెల్లంపల్లి ఫైర్