telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

నేడు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

Degree exams TDP questiona Anantapur

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9,42,719 మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్‌ చేసుకున్నారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 4,90,169 మంది ఉన్నారు.

https://tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in,www.exam.bie.telangana.gov.in, http://results.cgg.gov.in,http://bie.tg.nic.in, http://examresults.ts.nic.in ఫలితాలను ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. అలాగే టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చు. ప్రిన్సిపాల్స్‌ కాలేజీల వారీగా ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి www.bie.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని ఇంటర్మీడియట్‌ బోర్డు తెలిపింది.

Related posts