telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్‌బాస్- 4” ప్రోమో… గోపీ అంటూ కొత్త అవతారంలో నాగ్…!

Bigg-Boss-4

భారీగా ప్రేక్షకాదరణను దక్కించుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పటి వరకు మూడు సీజన్లను ఈ షో పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాల్గవ సీజన్‌ మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మరో ప్రోమో విడుదల అయ్యింది. మూడవ సీజన్‌కు హోస్ట్‌గా చేసిన కింగ్‌ నాగార్జునే నాలుగవ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు విడుదల చేసిన బిగ్‌బాస్‌ 4 ప్రోమోలో నాగార్జున స్టైలిష్‌గా కనిపించగా ప్రస్తుతం విడుదల చేసిన ప్రోమోలో ఆయన ఓల్డ్‌ లుక్‌లో ఒక బయోస్కోప్‌ పట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ గోపి అని పిలుస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసా ? అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంతకీ అసలు గోపీ ఎవరు ? ఈసారి బిగ్‌బాస్‌ తీసుకురాబోతున్న ఈ కొత్త క్యారెక్టర్‌ ఎవరు అని అంతా ఆలోచిస్తున్నారు. సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని చాలా విషయాలు దాని ద్వారా చెప్పేవారు. అయితే ఈసారి గోపి అంటూ ఎవరు రాబోతున్నారో చూడాలి.

Related posts