telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” ట్రైలర్… రామ్ ఊర మాస్

Ismart-Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 18న గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. రాజ్ తోట ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రబృందం. తెలంగాణ యాసలో రామ్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం రామ్ వన్ మ్యాన్ షోలా సాగుతుందనేది అర్థమవుతోంది. ఇక హీరోయిన్ల తో రామ్ రొమాన్స్ డోస్ కూడా ఎక్కువే ఉంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts