telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెంగళూరు నారత్నమ్మ బయోపిక్ లో సమంత ?

Samantha

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అందం, అభినయం, విభిన్నమైన సినిమాలతో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. సమంత ఇటు సినిమాల్లో నటిస్తూనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్ లో వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టబోతోంది. సమంత సోషల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన మజిలీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇటీవల వచ్చిన 96 రీమేక్ ‘జాను’ మాత్రం నిరాశ పరిచినా సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తో సమంత ఓ సినిమా చేస్తుందని తెలుస్తుంది. ప్రముఖ సింగర్ బెంగళూరు నారత్నమ్మ బెంగళూరు నారత్నమ్మ జీవిత కథ ఆధారంగా స్క్రిప్టును రెడీ చేస్తున్నారట. నేటి జనరేషన్ కి తగ్గట్టు ఈ బయోపిక్ మేకింగ్ కోసం సింగీతం చాలానే హార్డ్ వర్క్ చేస్తున్నారట.ఇటీవలే సింగీతం కు కరోనా సోకింది. ఇటీవలే ఈ మహమ్మారి నుంచి ఆయన బయట పడిన విషయం తెలిసిందే.

Related posts