telugu navyamedia
రాజకీయ వార్తలు

2021 కంటే ముందు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం లేదు: డబ్ల్యూహెచ్‌వో

corona vaccine covid-19

కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాలు ప్రోయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ట్రయల్స్‌ను కూడా నిర్వహిస్తూ సానుకూల ఫలితాలు వచ్చాయంటూ ప్రకటనలు చేస్తున్నాయి. దీంతో ఈ ఏడాదిలోపే వ్యాక్సిన్‌ వస్తుందని ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కీలక వ్యాఖ్యలు చేసింది. 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

డబ్ల్యూహెచ్‌వో అత్యవసర విభాగ అధిపతి మైక్‌ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ…‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది. ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామమని తెలిపింది. కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న అమెరికాతో పాటు పలు దేశాల్లో బడుల పునఃప్రారంభం సరికాదని ఆయన చెప్పారు. కరోనా సామాజిక వ్యాప్తి నియంత్రణలోకి వచ్చే వరకు విద్యా సంస్థలు తెరవకపోవడమే మంచిదని హితవు పలికారు.

Related posts