telugu navyamedia
తెలంగాణ వార్తలు

సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

*ఢిల్లీ చేరిన తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయం
*సోనియాను క‌లిసేందుకు వెంక‌ట‌రెడ్డి ప్ర‌య‌త్నం

కాంగ్రెస్ భువనగిరి ఎంపీ​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోనియా గాంధీ అపాయింట్​మెంట్​ కోరారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయం తీసుకన్నారు.

ఈ క్రమంలోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలను నేరుగా సోనియాగాంధీకు
వివ‌రించాల‌నుకుంటున్నాన‌ని ..అందుకే అపాయింట్‌మెంట్ కోరిన‌ట్లు తెలిపారు

కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య ఇటీవల జరుగుతోన్న కోల్డ్​ వార్ నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు కాంగ్రెస్ సీనియర్​ నేత మర్రి శశిధర్​రెడ్డి సైతం సోనియాతో భేటీ అయ్యే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అధిష్ఠానానికి తెలియనీయడం లేదని ఇదివరకే అసహనం వ్యక్తం చేసిన మర్రి.. తమ ఆవేదనను సోనియాకు వివరించనున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రేవంత్‌రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌ లు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ.. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణిక్కం ఠాగూర్‌.. రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు

అయితే ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో సోనియా గాంధీ.. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కోమటిరెడ్డికి అపాయింట్‌మెంట్ దొరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ‌

Related posts